top of page

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులకు బహుమతుల

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 20, 2023
  • 1 min read

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులకు బహుమతుల

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న ఎంఈఓ

నందలూరు శాఖ గ్రంథాలయము నందు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు గ్రంథాలయం అధికారి రవిశంకర్ రాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి నాగయ్య . సర్పంచ్ జంబు సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ సెల్ఫోన్ కు దూరంగా ఉండాలని గ్రంధాలయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని కొనియాడారు. వ్యాస రచన, డ్రాయింగ్, ముగ్గులు, క్యారమ్స్ పోటీలు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం సర్పంచ్ మరియు మండల విద్యా శాఖ అధికారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంకు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు రౌఫ్ భాష, కృపానందం, లక్ష్మీనారాయణ, అన్నమాచార్య మరియు గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page