top of page

ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు భోజన ఏర్పాట్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2023
  • 1 min read

మానసిక వికలాంగ చిన్నారులకు భోజనం ఏర్పాటు.

ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్లబోతుల యూత్ ఆధ్వర్యంలో నల్లబోతుల నాగరాజు చేతుల మీదుగా రామేశ్వరంలోని వికాస్ విహార్ మానసిక వికలాంగ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నల్లబోతుల యూత్ ఆధ్వర్యంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని రాజకీయ జీవితం లో ఉన్నత స్థితికి చేరుకొని ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రొద్దుటూరు ను శాంతియుతంగా ఉండేలా ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్, ప్రొద్దుటూరు మండల ఉపాధ్యక్షుడు షరీఫ్, ప్రొద్దుటూరు తెలుగు యువత కార్యదర్శి పల్ల సాయిరాం, పెన్నా నగర్ సుభాన్, మధు, ప్రసాద్, మాబుసున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page