top of page

రాష్ట్ర ప్రజల కోసం బాబు - ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను - జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 10, 2023
  • 1 min read

రాష్ట్ర ప్రజల కోసం బాబు - ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను - జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర ప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అరెస్టు పై పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరును ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు? త్వరలో లోకేష్ బాబు, అచ్చం నాయుడుని కూడా అరెస్టు చేయవచ్చునని ఆయన తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు టిడిపి నాయకులను అరెస్టు చేశారని, చట్టం పట్ల గౌరవం కలిగిన తమ నాయకుడు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించి రాష్ట్రంలో ఎక్కడ శాంతిభద్రతలకు విగాథం కలగకుండా నడుచుకున్నాడని, అలాంటి తమ నాయకుడిపై ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదని, తమ నాయకుడి అరెస్టు తమకు బాధ కలిగిస్తుందని, రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నారని, తాను గతంలో జైలుకు వెళ్లి వచ్చిన సంఘటనను గుర్తు చేస్తూ, ఇలాంటి రాజకీయ పరిస్థితులలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా? నూతన పెట్టుబడులు పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయా? అంటూ ప్రశ్నించారు? గతంలో అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని మాట్లాడిన పోలీసులు, నేడు చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారు అంటూ పోలీసు వ్యవస్థను ప్రశ్నించారు? చంద్రబాబు నాయుడు మాటలు తనకు స్ఫూర్తిని నింపాయని అన్నారు. రాబోవు రోజుల్లో మరింత చురుగ్గా పార్టీ కోసం పనిచేసి ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ, మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page