ఈత సరదా ప్రాణం తీసింది
- VOICE OF HERALD

- Feb 28, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా: టంగుటూరు మండలం. నిడమానూరు గ్రామం SC కాలనికి చెందిన పి.చెంచుమహేష్, పి.వాసు, ఎల్.జగన్ అనే ముగ్గురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం సరదాగా మూసినదికి ఈత కొట్టడానికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు.దీంతో వెంటనే గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో పొందూరు సమీపంలోని పొదోరిపాలెం దగ్గర పిల్లల చెప్పులు బట్టలు గుర్తించిన పోలీసులు, నది అంత గాలించి ముగ్గురు మృతదేహలను బయటకు తీసారు.
ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.




Comments