top of page

పేదలకు నిత్యవసర సరకులను పంపిణీ చేసిన ప్రజ్వల వాణి కల్చర్ ఫౌండేషన్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 20, 2022
  • 1 min read

పెదగంట్యాడ 64 వ వార్డు గొడ్డివానిపాలెం సేవ భవనము నందు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజ్వల వాణి వెల్ఫేర్ సొసైటీ ఆర్థిక సహకారంతో పేదలకు నిత్యవసర సరకులు, స్నేక్స్ కిట్స్ (తిను బండారాలు) పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 64 వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ ధల్లి గోవింద్ రెడ్డి గాజువాక నియోజకవర్గ బిజెపి కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మానవ సేవే మాధవ సేవగా భావించి ఎదుటివారికి మన స్థాయికి తగ్గ ధర్మము, సహాయం చేయటం అన్నది గొప్ప విషయమని ముఖ్యముగా పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధులు కి సహాయపడటం మరింత గొప్ప విషయమని వారు అన్నారు .సేవ చేయడానికి వారి అవసరాలకు తగ్గ వస్తువులు సమకూర్చడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. అనంతరం వికలాంగులు, పిల్లలు మరియు వృద్ధులకు కలిపి వంద మందికి విత్యవసర సరకులు స్నాక్స్ (తిని బండారాలు) కిట్టు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్ల అప్పారావు ,కోఆర్డినేటర్ భువనేశ్వరి, కోశాధికారి గిరి చరణ్ నాయుడు మరియు ప్రజల వాణి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి అలివేలు ,దుర్గారావు ,శ్రీకాంత్ ,త్రినాధ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page