top of page

ప్రొద్దుటూరుకు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తరాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 26, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు ను జిల్లా కేంద్రం గా ప్రకటించాలని కోరుతూ ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జె.ఏ.సి కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో మునిసిపాల్టీ కార్యాలయం దెగ్గర ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డ్స్ పంపడం జరిగింది. ఈ సందర్భంగా జె.ఏ.సి కన్వీనర్ మాదాసు మురళీ మాట్లాడుతూ రాయలసీమ లోనే వ్యాపారం పరంగా, విద్యపరంగా కాలేజి లు వైద్య పరంగా హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ స్థలాలు ఉండడమే కాకుండా చుట్టూ పక్కల నియెజకవర్గాలకు నిరంతరం రావడనికి సులువైన మార్గాలు వ్యాపార పరంగా అగ్రగామిగా పసిడి పురి ప్రొద్దుటూరుగా పిలవబడుతున్న ప్రొద్దుటూరు ను జిల్లా కేంద్రం గా ప్రకటించాలని, ఇది ఇక్కడి ప్రజల డిమాండ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జె.ఏ.సి కో కన్వీనర్ గొడుగు గురప్ప, బి.సి సమాఖ్య నాయకులు వజ్జల వెంకట కృష్ణ యాదవ్, బి.వి రాజు, జె.ఏ.సి నాయకులు రామకృష్ణ యాదవ్, శశిధర్, బాల సుబ్బయ్య యాదవ్, తిరుపతయ్య, విద్యార్థి నాయకులు వంశీ, మునవర్, మోహన్, కసిమ్, రమేష్, కుమార్ , రవి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page