top of page

"పోషణ పక్వాడా" కార్యక్రమంలో ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ నిర్మల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 22, 2022
  • 1 min read

చిట్వేలు మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల ఆధ్వర్యంలో.. ఈరోజున మండల పరిధిలోని రాజుకుంట అంగన్వాడి కేంద్రం నందు " పోషణ పక్వాడా" కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 0-5 సంవత్సరాల లోపు పిల్లల శారీరక ఎదుగుదలను మరియు లోపాలను గుర్తిస్తూ... బలహీనంగా ఉన్న పిల్లల తల్లులకు వారి పోషణ పట్ల ప్రత్యేక ఆహార ఆరోగ్య సలహాలను సూచించారు. పాలు, గుడ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించే విధంగా ప్రయత్నించాలని తల్లులను కోరారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలు, చెర్లోపల్లి,అనుంపల్లి, రాజుకుంట, చింతల చెలిక గ్రామాల అంగన్వాడీ టీచర్లు సుధామణి, రాజేశ్వరి, సుబ్బలక్ష్మమ్మ, మాధవి లత, శ్రీదేవి మరియు పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page