top of page

పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 24, 2022
  • 1 min read

పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు నందు పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి నిర్వహించిన క్రైస్తవ సోదరీమణులకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.  పలువురు మహిళలకు ఆయన చేతులు మీదుగా చీరలు, నూతన సంవత్సర క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోరెడ్డి మాట్లాడుతూ, ముందుగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాచమలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరీమణులకు చీరల పంపిణీ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, రాబోవు రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి క్రిస్మస్, రంజాన్ పర్వదినాన చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే మార్చి 20వ తారీకున ఆయన సతీమణి కీర్తిశేషులు పోరెడ్డి సుజాత జయంతి పురస్కరించుకొని పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాలు తలపెట్టినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, సీనియర్ వైసీపీ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, అప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ,  గోన ప్రభాకర్ రెడ్డి, బొందిలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ రసపుత్ర రజిని, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఒకటవ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page