top of page

23 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2021
  • 1 min read

23 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోమ్ శాఖ


రాష్ట్రంలోని పలువురు పోలీసు అధికారులకు IPS హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం గెజిట్‌ విడుదల చేసింది. ఏపీ పోలీసుశాఖలో ఎస్‌ఐలుగా, డీఎస్పీలుగా చేరిన అధికారుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. 2016 నుంచి 2019మధ్యలో పదోన్నతి పొందాల్సిన 23 మంది అధికారుల పేర్లు పంపగా పరిశీలించిన తర్వాత కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 2016లో ఏడుగురు, 2017లో ముగ్గురు, 2018లో ఆరుగురు, 2019లో నలుగురిని ప్యానెల్‌ ఎంపిక చేసింది. అందరికీ ప్రమోషన్‌ లభించగా 2016 ప్యానెల్‌ లోని డొక్కా కోటేశ్వరరావు, 2017 ప్యానెల్‌లోని టి. మోహన్‌ రావు పదవీ విరమణ చేయగా 2017 ప్యానలిస్ట్‌ రామ్‌ ప్రసాద్‌ కొన్ని నెలల క్రితమే కరోనాతో మృతి చెందారు. అయితే 23మందికి పదోన్నతి లభించినా 20మందే ఐపీఎస్‌ హోదా పొంది సేవలందించనున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page