మొక్కలు నాటండి, ప్లాస్టిక్ రహిత విశాఖను చూడండి
- VOICE OF HERALD

- Jun 5, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర రిపోర్టర్ వీరా
మొక్కలు నాటండి, ప్లాస్టిక్ రహిత విశాఖను చూడండి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జీవీఎంసీ 74 వ వార్డు పరిధి దాల్లివానిపాలెం సచివాలయ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చెబేట్టింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే నాగిరెడ్డి, జోనల్ కమిషనర్ డి శ్రీధర్, నియోజకవర్గ ఇంచార్జ్ దేవన్ రెడ్డి, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి మొక్కలు నాటేరు. ఈ సంధర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన అవసరం ఎంత ఆయన ఉందన్నారు.
వంశీ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ మానవాళికి మనుగడకు మొక్కలు పెంపకం ఎంతో అవసరం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్భంగా మన గ్రేటర్ పరిధిలో జిల్లా కలెక్టర్ డా.. మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా ఆదేశాలతో ప్లాస్టిక్ నిర్మొలనపై ఉక్కు పాదం మోపేరు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ కవర్ లు, ప్లాస్టిక్ గ్లాస్ లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధం అన్నారు. ప్లాస్టిక్ నిర్మొలన పూర్తిగా జరగాలంటే ప్రజలందరి సహకారంతోనే సాధ్యపడుతుందని జోనల్ - 6 కమిషనర్ డి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం కాపాడటానికి అలాగే ప్లాస్టిక్ రహిత విశాఖను విశాఖ ను తయారు చేయాలని ఒక ప్లాస్టిక్ కలవాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది దీనివలన ప్లాస్టిక్ వాడకం లో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ ప్లాస్టిక్ రహిత విశాఖ గా తయారు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఏఎంహెచ్ ఓ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓ రామలక్ష్మి, రెవిన్యూ సిబ్బంది, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ సీతారామ్, సి ఓ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది, వైసీపీ నాయకులు దామా సుబ్బారావు, వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.



Comments