top of page

వికలాంగుల కాలనీ నిర్మించుటకు సహకరించాలని ప్రభుత్వ విఫ్ కోరముట్ల ను కోరిన: జె.యన్. ఆంధ్రయ్య

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 28, 2022
  • 1 min read

వైయస్ఆర్ కడప జిల్లా చిట్వేల్ మండలం గట్టుమీదపల్లి దగ్గర 2007-లో డాక్టర్ వైయఆర్ ఏర్పాటు చేసిన వికలాంగుల పునరావాస కాలనీ నేటికీ నిర్మాణానికి నోచుకోలేదని కాలనీ నిర్మించుటకు కృషి చేయాలని జె యన్ ఆంధ్రయ్య ఈ రోజు ఉదయం ఎం ఎల్ ఏ కోరముట్ల శ్రీనివాసులును కోరారు. తదుపరి వికలాంగులతో కలసి చిట్వేల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను గుర్తించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచిస్తూ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని వికలాంగులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో వికలాంగుల సంఘము నాయకులు యస్ గోపాల్ రాజు, పి శంకర్ రాజు,మహిళా చైర్మన్ జె నాగమణి, కె రత్నమ్మ, వి లక్షుమ్మ, ఎం సుబ్బారాయుడు, యన్ వెంకట్రామరాజు సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి హెచ్. చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా అధ్యక్షులు సి చెన్నయ్య, జిల్లా కార్యదర్శి పందికాల మణి. వై పెంచలయ్య, వికలాంగులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page