top of page

కొనిరెడ్డిని సన్మానించిన దివ్యాంగులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 8, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


డిసెంబరు ఆరో తేదీన స్థానిక మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మదర్ థెరీసా వికలాంగుల సేవా సంఘం అధ్యక్షుడు షాకీర్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించగా, నాడు కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కొనిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని గురువారం సాయంత్రం వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఘనంగా సత్కరించి మోమెంటు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం పొందేలా తమ ప్రభుత్వం చర్యలు ఇదివరకే తీసుకుందని ఆయన అన్నారు. కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు 150 మంది వికలాంగులకు భోజనాలు, వికలాంగుల సంఘానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు ఆయన తెలియచేశారు.

కార్యక్రమంలో షేక్ షాకీర్ హుస్సేన్, ఎస్ఎం భాష, అల్తాఫ్, హనుమంతు, కాజా తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page