top of page

వైయస్సార్ బీమా అందజేసిన తిప్పల వంశీ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 20, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 74 వ వార్డ్ దల్లివానిపాలెం లో బైరెడ్డి అప్పలరెడ్డి అనే వ్యక్తి అకాల మరణం చెందారు, ఆయన కుటుంబానికి ఈరోజు 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి చేతుల మీదుగా వైయస్సార్ బీమా తక్షణ సహాయం క్రింద పదివేల రూపాయలు అందజేశారు, ఈ సందర్భంగా కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ అప్పలరెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయనకు వైయస్సార్ పార్టీ అన్న వైయస్సార్ కుటుంబం అన్నా చాలా అభిమానం ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి అన్ని విదాలుగా నా వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గొందేశి సత్యరావు,దల్లి పైడికొండ, గొందేశి అప్పలరెడ్డి, మోహన్, కిషోర్,తిరుపతి, చిన్ని, మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page