top of page

రైతుల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం - మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 7, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తోందని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రామేశ్వరం కు చెందిన రైతు మార్తల ఓబుల్ రెడ్డి కి సబ్సిడీలో మంజూరైన ఐచర్ ట్రాక్టర్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధికై ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లో భాగంగా రైతు భరోసా కేంద్రాలు ప్రతి సంవత్సరం పెట్టుబడి ఆర్థిక సహాయం సబ్సిడీ విత్తనాలు వ్యవసాయానికి చెందిన ఎరువులు పురుగు మందులు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కే దక్కుతుంది అన్నారు. అందులో భాగంగా వైయస్సార్ యాత్ర అ సేవా పథకం ద్వారా సబ్సిడీతో తో e వ్యవసాయ పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు.


ఈ కార్యక్రమంలో రామేశ్వరం శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పల్లెటి శంకర్ రెడ్డి, 32 వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి మరియు రామేశ్వరం వైఎస్ఆర్ సీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page