top of page

టిడిపి శ్రేణుల మధ్య పంతగాని జన్మదిన వేడుకలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 17, 2022
  • 1 min read

రాబోవు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వస్తుంది?

  • వస్తుంది

  • రాదు

  • చెప్పలేము

ఘనంగా పంతగాని జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో బుధవారం తెదేపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ జన్మదిన సంబరాలు పట్టణంలో అభిమాన శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. యూత్,అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి ఆయన స్వగృహం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన బారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై, తెలుగుదేశం పార్టీపై వెలకట్టలేని అభిమానం చూపిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని సదా,సర్వదా నిలబెట్టుకుంటానని, మీరు నాపై చూపించే అభిమానం ఆప్యాయత అనురాగాలు చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ పార్టీ అధ్యక్షులు నాకిచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ మీలో ఒకడిగా ఉంటూ మీ క్షేమమే నా క్షేమంగా భావిస్తూ అండగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొక్కసం చలపతి, కాకర్ల లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయులు నాయుడు,నార్జల హేమరాజ్,పోతురాజు నవీన్, దినేష్ చౌదరి ,జుబేర్, కరిముల్లా, హరీష్, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ మరియు ఐదు మండలాల కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page