ఆన్లైన్ ద్వారా సొంత ఇంటి కొరకు దరఖాస్తుల స్వీకరణ
- VOICE OF HERALD

- Jan 11, 2022
- 1 min read
అమరావతి, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు, రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు.
నేటి నుంచి http://migapdtcp.ap.gpv.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.




Comments