ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన సదస్సు
- EDITOR

- Dec 24, 2021
- 1 min read
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో తులసి బాబు ఆధ్వర్యంలో ఓం శాంతి భవనం లో ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోతుగడ్డ తాతబాబు గారు మరియు పలు గ్రామాల సర్పంచులు అలాగే వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పకృతి వ్యవసాయం చేయాలని దానికి తమ వంతు సహాయం ఏం కావాలన్నా చేస్తాను అని తులసి బాబు చెప్పడం జరిగింది. రైతులందరూ కచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఒక మార్గదర్శిగా మీరు ముందు నడపాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు మరియు హార్టికల్చర్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో ఓం శాంతి కి సంబంధించిన సూర్యనారాయణ రావు అలాగే సుధ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికతను జోడిస్తూ ఈ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది.



Comments