top of page

వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.1570కోట్లు విడుదల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2021
  • 1 min read

వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.1570కోట్లు విడుదల: మంత్రి పెద్దిరెడ్డి


జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఐదు రోజుల పాటు పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జనవరి 1న ప్రత్తిపాడులో కార్యక్రమాన్ని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75లక్షల మంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1570.60 కోట్లు విడుదల చేసిందన్నారు. జనవరి నెలలో కొత్తగా 1.41లక్షల మందికి పింఛన్లు మంజూరు అయ్యాయని మంత్రి వివరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page