top of page

చిట్వేలు, ఓబులవారిపల్లె మండలాల నోడల్ అధికారుల మార్పు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 6, 2022
  • 1 min read

రైల్వేకోడూరు పరిధిలోని చిట్వేలు మండలం నోడల్ అధికారి గా ప్రస్తుతం చిట్వేలు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కేడి వరప్రసాద రావు ను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రస్తుతం డాక్టర్ అబ్దుల్ ఆరిఫ్ కొనసాగుతుండగా ఆ స్థానంలో డాక్టర్ వరప్రసాద్ నియామకమయ్యారు.

అలాగే ఓబులవారిపల్లి మండల నోడల్ అధికారి గా డాక్టర్ కే చంద్రశేఖర్ స్థానంలో డాక్టర్ కె విజయ్ కుమార్ నియమితులైనట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాలతో నియమితులైన వీరు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పురోగతిని కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు.


ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలయిన నవరత్నాలను అర్హులకు అందించడంలో జాప్యం లేకుండా సజావుగా సాగేటట్లు చూడటంలో వీరు ప్రాధాన్యత వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page