top of page

పల్సర్ నూతన మోడల్ వాహనాన్ని ప్రారంభించిన కొనిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 24, 2022
  • 1 min read

పల్సర్ నూతన మోడల్ వాహనాన్ని ప్రారంభించిన కొనిరెడ్డి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


శనివారం ఉదయం స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో గల బజాజ్ ద్విచక్రవాహన షోరూం నందు నూతన 150 సిసి కెపాసిటీ గల పల్సర్ వాహనాన్ని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు, బజాజ్ షోరూం వారికి వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

అనంతరం షోరూమ్ మేనేజర్ కె. రాజు మాట్లాడుతూ, పల్సర్ ద్విచక్ర వాహనాలలో నూతన ఒరవడిని సృష్టిస్తూ, ముందుకు దూసుకుపోతున్న పల్సర్ మోడల్ నందు నేడు 150 సిసి వేరియంట్ ను నూతనంగా ప్రారంభించిన సర్పంచ్ కొనిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు తమ కంపెనీ ఉత్పత్తులను ఆదరించిన వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మునుపటిలాగే తమ కంపెనీ ఉత్పత్తులను ఆదరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లి వైసీపీ నాయకులు, బజాజ్ షోరూం నిర్వాహకులు, సిబ్బంది పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page