మంగంపేట నూతన డ్రైవర్ల సంఘం ఎంపిక. పలువురు అభినందనలు.
- DORA SWAMY

- May 25, 2022
- 1 min read
మంగంపేట డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు.

అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో ఉన్న ఏపీఎండీసీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగంపేట డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వరంగ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు కొండయ్య ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే మంగంపేట డ్రైవర్ల సంఘం అధ్యక్షులుగా దుర్గయ్య,పిశ్రీనివాసులు ప్రధాన కార్యదర్శిగా,సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా, కోశాధికారిగా దొరస్వామి,జనరల్ సెక్రెటరీగా కుళ్లాయప్ప, చెంగల్రాయుడు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా ఎన్నిక కాబడిన కార్యవర్గం మూడు సంవత్సరాల పాటు కార్యవర్గంలో ఉంటారని రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక ల అనంతరం సి పి ఓ వెంకట రమణ గారిని కలిసి మంగంపేటలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది అందులో ముఖ్యంగా బోర్డు సమావేశంలో డ్రైవర్లకు నిర్దేశించిన బేసిక్లు అమలు చేయాలని, డ్రైవర్ల అందరికీ ఆథరైజేషన్ కల్పించి ఇవి బేసిక్ ఇవ్వాలని ఇలా పలు సమస్యలపై చర్చించినట్లు నూతన కార్యవర్గం తెలియజేశారు.

నూతన కార్యవర్గం సమస్యలను సానుకూలంగా విన్న సిపిఓ స్పందిస్తూ మీ యొక్క సమస్యలను ఏపీఎండీసీ బోర్డు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అలాగే నూతన కార్యవర్గం ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసిన ట్లు తెలిపారు.



Comments