top of page

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ - కొత్తపల్లె

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 2, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీ పదవ వార్డు నందు నేడు నూత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పంచాయితీ పరిధిలోని పలు అభివృద్ధి పనులలో భాగంగా నేడు టీచర్స్ కాలనీ పదవ వార్డు నందు పాత గ్రావెల్ రోడ్డు స్థానంలో రెండు వందల ముప్పై మీటర్ల నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పదిహేను లక్షల రూపాయల పంచాయతీ నిధులతో నిర్మించనున్నట్లు తెలిపారు. పంచాయితీ అబివృధే ధ్యేయంగా తన తండ్రి కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పని చేస్తున్నారని, పంచాయతీ పరిధిలో నేటికీ ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో మంచి నీరు త్రాగునీటి సమస్య తీర్చగలిగామన్నారు. త్వరలో కోటి రూపాయల డి.ఏం.ఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధులతో కాలువల నిర్మాణ పనులు చేప్పట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తమ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న కడప ఏం.పీ అవినాష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లె పంచాయతీ సెక్రటరీ కె. పుల్లారెడ్డి, పడవ వార్డు మెంబర్ ఇస్మాయిల్, ఆరవ వార్డు మెంబెర్ మని ప్రసాద్, కె. రవి, ప్రసన్న, కొనిరెడ్డి వాసు, నంగునూరు పల్లె నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page