top of page

విద్యార్థుల.. క్రమశిక్షణ,దేశభక్తికి సుమార్గం ఎన్సిసి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 3, 2022
  • 1 min read

విద్యార్థుల.. క్రమశిక్షణ,దేశభక్తికి సుమార్గం ఎన్సిసి.

ఎన్సిసి విద్యార్థుల ఎంపికలో అధికారి పసుపుల రాజశేఖర్.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 30వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ విబోర్ గుప్త ఆదేశాల మేరకు శనివారం నాడు ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థుల ఎంపిక జరిగింది.ఈ సందర్భంగా పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ... 2022 - 23 సంవత్సరానికి గాను ఎన్సిసి ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి మరొక 13 మందిని రిజర్వు జాబితాలో పెట్టడం జరిగిందన్నారు.

ఎన్సిసి లో చేరి క్రమశిక్షణ, ఐక్యతను, దేశభక్తిని, పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ ఎంపిక లో భాగంగా హవాల్డార్ ఎం ఈశ్వర్ రెడ్డి,హవల్డార్ చంద్ర బస్నెట్ విద్యార్థులకు పరుగు పందెం,శారీరక పరీక్షలు నిర్వహించి తుది జాబితాను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page