top of page

చిట్వేలు ఎన్సిసి క్యాడేట్ లచే ఘనంగా అంబేద్కర్ 131 జయంతి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

చిట్వేలు ఎన్సిసి క్యాడేట్ లచే ఘనంగా అంబేద్కర్ 131 జయంతి - విద్యార్థులు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి.

అంబేద్కర్ జయంతి సందర్భంగా చిట్వేలు ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్ సి సి విద్యార్థులచే ఉన్నత పాఠశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ జోహార్లు అంబేద్కర్ నినాదాలు చేస్తూ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి , ఎన్సిసి అధికారి రాజశేఖర్ లు మాట్లాడుతూ అతి పేద స్థాయినుంచి, ఆటుపోట్లను చవిచూస్తూ దేనికి భయపడక కటోర శ్రమ, వివేకం తో రాజ్యాంగాన్ని రచించే మేధావిగా ఎదిగిన అంబేద్కర్ జీవితాన్ని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకుని కష్టంతో కాక ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డేవిడ్ ప్రసాద్,దుర్గరాజు, చిన్న బాబు, కిరణ్ కుమార్ రాజు మరియు పెద్ద ఎత్తున ఎన్సిసి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page