top of page

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ పాదయాత్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 11, 2022
  • 1 min read

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ పాదయాత్ర


తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. 2023 జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడవనున్నారు. ఈ మేరకు పాదయాత్రపై నేతలకు ఆయన స్పష్టత ఇచ్చారు.

ఏడాదిపాటు ప్రజల్లోనే ఉండేలా లోకేశ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మార్గంమధ్యలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పలు సభల్లోనూ ఆయన ప్రసంగించే అవకాశముంది. లోకేశ్‌ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లూ క్లారిటీ రాలేదు. తాజాగా ఆయనే ప్రకటించడంతో తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page