top of page

నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్‌ పాదయాత్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 31, 2023
  • 1 min read

యువగళంకు ఘన స్వాగతం


నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్‌ పాదయాత్ర


తొలి రోజు చౌడూరు నుండి చౌటపల్లి వరకు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గురువారం ప్రవేశించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలం చౌడూర్ వద్ద లోకేష్‌కు ప్రొద్దుటూరు ఇంఛార్జ్‌ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ప్రొద్దుటూరు ఇంఛార్జ్‌ జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, సురేష్ నాయుడు,ముక్తియర్, ఈవి సుధాకర్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది.లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో దద్దరిల్లింది. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీ పడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు.ఇక లోకేష్‌ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పార్టీ శ్రేణుల అభిమాన వర్షంలో లోకేశ్‌ తడిసి ముద్దయ్యారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొని అడుగులేశారు. పాదయాత్ర పొడవునా లోకేశ్‌ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వెతలను విన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రజల నుంచి స్వాగతాలు అందుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page