top of page

జె బ్రాండ్ మద్యం సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి - నంద్యాల కొండారెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 13, 2024
  • 1 min read

జె బ్రాండ్ మద్యం సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి - నంద్యాల కొండారెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి యువ నాయకులు కొండారెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తోందని, కంపెనీ బ్రాండ్ల మద్యం తీసి వాటి స్థానంలో జగన్ బ్రాండ్ మద్యం ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నెహ్రు రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తయారీ, అమ్మకాలు తదితర కనీస రికార్డులు, టాక్స్ ఎగ్గొట్టటానికి కొనుగోళ్లు అమ్మకాలు తయారీ ప్రతులు ప్రభుత్వానికి చూపకుండా తమకు ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యం అమ్మకాలతో జగన్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని, దేశంలోనే ఇది అతి పెద్ద దోపిడీగా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన ప్రియులు నాసిరకం మద్యం సేవించి వేల మంది చనిపోతున్నారని, ఈ చావులకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page