top of page

వారాహి యాత్ర సజావుగా సాగాలి అని ప్రత్యేక పూజలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 11, 2023
  • 1 min read

ప్రత్యేక పూజలు జరిపి పోస్టర్ ఆవిష్కరిస్తున్న జనసైనికులు

వారాహి యాత్ర సజావుగా సాగాలి అని శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాధ స్వామి గుడిలో పూజ చేసి వారాహి యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన నందలూరు జనసేన పార్టీ సైనికులు.

ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలంలో జనసేన నాయకుల సమక్షంలో వారాహి యాత్ర సజావుగా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలి అని దేవుడి ఆశీస్సులు ఉండాలి అని శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాధ స్వామి గుడిలో పూజ చేసి మరియు వారాహి యాత్ర పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను, భూ కబ్జాలను, ఇసుక మాఫియాను, అవినీతి పాలనను ఎండగడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఈనెల 14వ తేదీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో యాత్రను చేపట్టబోతున్నారని, రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారని అన్నారు.

అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి జనవాని కార్యక్రమం, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సందర్భంగా దిశా నిర్దేశ చేసే కార్యక్రమం అలాగే ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని గద్దేధించి వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రజా ప్రభుత్వం స్థాపన దిశగా ఈ వారాహి యాత్ర ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టంగుటూరు ఈశ్వర్,నందు,మన్నూరు గోపి,కళ్యాణ్,సాయి రుద్ర రాజు,సాయి రాయల్,దస్తగిరి,ఎర్రిపాపల్లి మారుతీ తదితరులు పాలుగొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page