top of page

మోసపూరిత బస్సు యాత్రను అడ్డుకుంటాం - నల్లబోతుల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 27, 2023
  • 1 min read

ప్రజలను మరోసారి మోసం చేయడమే వైసిపి బస్సు యాత్ర

మోసపూరిత బస్సు యాత్రను అడ్డుకుంటాం - రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ మోసపూరిత బస్సు యాత్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి లకు ఏ మేలు చేశారని వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టిందో స్పష్టం చేయాలన్నారు. జగన్ పాలనలో నిత్యవసర ధరలు కరెంటు చార్జీలు తెలుగు సామాన్యులకు మోయలేని భారం మోపారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎలాంటి మేలు చేయకపోగా వారిపై దాడులకు ప్రోత్సహించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు ఏ మేలు చేశామని చెప్పేందుకు బస్సుయాత్ర చేపట్టారని ఆయన ప్రశ్నించారు? ఇలాంటి మోసపూరితమైన బస్సు యాత్రను రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఖలీల్, బీసీ నాయకులు చలమయ్య, ఎస్సీ నాయకుడు మధు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page