top of page

ప్రజాక్షేత్రం నుంచి చంద్రబాబు దూరం చేసిందికే జగన్ కుట్ర - నల్లబోతుల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 14, 2023
  • 1 min read

ప్రజాక్షేత్రం నుంచి చంద్రబాబు దూరం చేసిందికే జగన్ కుట్ర


తక్షణమే మెరుగైన అధునాతన వైద్యం అందించాలి


రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లపోతుల నాగరాజు డిమాండ్

ప్రొద్దుటూరు


ప్రజా నాయకుడు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసి కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజా క్షేత్రానికి చంద్రబాబును దూరం చేసేందుకే జగన్ కుట్ర చేస్తున్నారని తక్షణమే చంద్రబాబు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు కలిగిన చంద్రబాబు ఆరోగ్యపరంగా దెబ్బకొట్టే ప్రయత్నంలో జగన్ కుట్ర చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంగా ఆయనకున్న చర్మ సంబంధిత సమస్య కారణంగా వేడి నీళ్ళు తిరస్కరించడం దుర్మార్గం చర్య అని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో వాతావరణ మార్పుల వల్ల చంద్రబాబు డి హైడ్రేషన్ గురి అయ్యేంత వరకు వైద్యం ఎందుకు అందించలేదో స్పష్టం చేయాలన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో ఇదంతా జరుగుతుందని చంద్రబాబు పై తప్పుడు నివేదికల మర్మం కూడా తెలపాలన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టును వైద్యులు ఇవ్వాల్సింది పోయి జైలు డీజీపీ, సూపర్నెంట్ ఇవ్వడం దేనికి సంకేతం అన్నారు. మీరు బ్లడ్, షుగర్ పరీక్షలు ఎందుకు చేయలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ను తక్షణమే సూపర్ స్పెషాలిటీ తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కి ఎటువంటి హాని జరిగిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కడప జిల్లా కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులు, ప్రొద్దుటూరు తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షుడు సునీల్ రెడ్డి, కార్యదర్శి పల్లా సాయిరాం, హర్ష రెడ్డి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page