top of page

మైదుకూరు ఎస్.బి.ఐ లో సామాజిక దూరం ప్రసక్తే లేదు గా...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

కడప జిల్లా, మైదుకూరు, ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా అడుగులు వేస్తున్న కొన్ని వాణిజ్య సముదాయాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి, అందుకు చక్కటి ఉదాహరణే కడప జిల్లా మైదుకూరు లోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, బ్యాంకు లో ఎక్కడా కూడా సామాజిక దూరం పాటించటం లేదు, అలాగని బ్యాంకు అధికారులు కూడా ఎటువంటి చర్యలకు ఉపక్రమించటం లేదు, వచ్చిన బ్యాంకు కస్టమర్లకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా కనీసం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా తన విధులు సక్రమంగా నిర్వర్తించటం లేదు, బ్యాంకు పని నిమిత్తం వచ్చిన వారికి కనీసం ఇక్కడి సిబ్బంది త్వరితగతిన వారికి తగు సూచనలు, సలహాలు ఇవ్వక పోగా, వచ్చిన వారు గంటల తరబడి బ్యాంకు సేవల కోసం నిరీక్షించాల్సి పరిస్థితి ఇక్కడ నెలకొంది. రోజు రోజుకు కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇక్కడ కరోనా మరింత వ్యాప్తి చెందే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకు వెళ్లిన సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతుంది, ఇప్పటికయినా సంబంధిత బ్యాంకు అధికారులు వచ్చిన కస్టమర్లకు సామాజిక దూరం పాటించవలసినదిగా చెప్పవలసిన ఆవశ్యకత అవసరం ఎంతయినా ఉంది, లేని యెడల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎంతయినా ఉంది అని బ్యాంకుకు వచ్చిన చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాలి అని ప్రజలు కోరుతున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page