top of page

ముస్లిం క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 25, 2023
  • 1 min read

ముస్లిం క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న నిర్వాహకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రంజాన్ మాసం 2023 మార్చి 23న ప్రారంభమౌతున్న సందర్భంగా రాజంపేట ముస్లిం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట ముస్లిం క్రికెట్ లీగ్ సీజన్-3 పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అన్ని మసీదుల తరపున 9 బృందాలు ఈ లీగ్ మ్యాచ్ లో పాల్గొంటాయని నిర్వాహకులు సిద్దీక్, యాసీన్, అలీ, అబ్దుల్ రజాక్, మౌలా తదితరులు తెలిపారు. ముఖ్య అతిథులుగా పట్టణ మసీదుల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, రాజంపేట ఈద్గా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.


నిర్వాహకులు క్రీడాకారులను పరిచయం చేసుకొని మ్యాచ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో హైదర్ బాషా, కే.షఫీవుల్లా ఖాన్, నవాబ్ ఖాన్, జమీల్, మసూద్ ఖాన్, న్యామతుల్లా, గౌస్ మండె తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page