top of page

గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్య పనులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 22, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్త సేకరణ జరగక గ్రామాల్లో ఉన్న విధులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ జరుగుతున్నా అది మొక్కుబడిగా సాగుతోంది. సేకరించిన చెత్తను గ్రామల సమీపంలోని ప్రధాన రహదారుల పక్కన పోయడంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు దుర్గంధం భరించలేక పోతున్నారు.

చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదని, దీంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ఆయా గ్రామస్థులు తెలియజేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగేలా చర్యలు చెప్పట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page