top of page

విచారణ చేస్తున్నామంటూ కాలయాపనయేల - బిజెపి నేత నరేంద్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 4 days ago
  • 1 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నా, అవినీతి వ్యవహారంపై అధికారులు "విచారణ చేస్తున్నాం" అంటూ కాలయాపన చేయడం సరికాదని బిజెపి నేత వంకదార నరేంద్ర రవు అన్నారు. ఈ సందర్భంగా వైఎంఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు వంకధార నరేంద్ర మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల అంశంపై సమగ్ర, పారదర్శక మరియు నిష్పాక్షిక విచారణ చేపట్టి, అవినీతికి పాల్పడిన బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యుల నుంచి పూర్తి స్థాయిలో రికవరీ చేయాలన్నారు. విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా, సంబంధిత అధికారులు వెంటనే నివేదికను ప్రజల ముందుంచి నిజాలను వెల్లడించాలన్నారు.


ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారెవరైనా వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున వారు కోరారు. అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించకుండా త్వరగా విచారణ పూర్తి చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని బీజేపీ ప్రొద్దుటూరు టౌన్ 1 అధ్యక్షులు వంకదార నరేంద్రరావు హెచ్చరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page