top of page

అభివృద్ధి పనులకు భూమిపూజ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 2, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


మునిసిపల్ ఒకటవ వార్డులో నూతన సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం కొరకు భూమిపూజ చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఒకటవ వార్డు నందు బుధవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వార్డులోని నరాల వీధి, ముస్లిం వీధిలో నూతన సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం కొరకు భూమిపూజ చేశారు, దాదాపు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలియచేసారు.

ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో చేపట్టామని, అందులో భాగంగా బుధవారం ఉదయం ఒకటవ వార్డు నందు సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం కొరకు ఎమ్మెల్యే రాచమల్లు భూమి పూజ చేశారని, పదమూడు లక్షల రూపాయల వ్యయంతో నరాల వీధిలో, మరో ఏడు లక్షల రూపాయల వ్యయంతో ముస్లిం వీధిలో నూతన రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నామని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి సచివాలయ పరిధిలో అభివృద్ధి పనుల కొరకు ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా, వాటితో ఈ సచివాలయం పరిధిలో రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు గాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ఒకటవ వార్డు కౌన్సిలర్ పండిటి సరోజ, వైసీపీ నాయకులు గోనా ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ మోడం సందీప్ రాయల్, పలువురు వైసీపీ నాయకులు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page