నిరవధిక సమ్మెలోకి దిగిన పారిశుద్ధ కార్మికులు
- VOICE OF HERALD

- Jul 11, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మునిసిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ఏఐటీయూసీ, సీఐటీయూ ల ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్, మునిసిపల్ కార్మిక, ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొనగా, ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం ఎదుట సమ్మె ప్రారంభించారు.

తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ ప్రొద్దుటూరు మున్సిపల్ కాంటాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో 35 వేల పారిశుద్ధ కార్మికులు ఈరోజు నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కాంటాక్ట్ కార్మికులు సిఐటియు, ఎఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మునిసిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు సీపీస్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, రెగ్యులర్ కార్మికులకు జి.పీ.ఎఫ్ అకౌంట్లు తెరవాలని ప్రధానంగా కోరారు. పర్మినెంట్ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు, మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ నివాదాలు చేశారు ఆరోగ్య భత్యం బకాయలు వెంటనే చెల్లించాలని, కాంటాక్ట్ వర్కర్స్ ని శాశ్వత ఉద్యోగులుగా ముఖ్యమంత్రి చెప్పిన మాటని అమలు చేయాలన్న డిమాండ్లతో గళమెత్తారు. లేనియడల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు.



Comments