top of page

బకాయి హెల్త్ అలవెన్సు వెంటనే చెల్లించాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 13, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర రిపోర్టర్

పారిశుద్ధ్య కార్మికుల బకాయి హెల్త్ అలవెన్సు వెంటనే చెల్లించాలని, ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లిస్తున్న హెల్త్ అలవెన్సు రద్దు చేస్తే సహించేది లేదు.


గాజువాక జోన్ - 6 పరిధి డే అండ్ నైట్, ప్యాకేజి, మరియు 66, 67, 70, 86, 87 వార్డులలొ పని చేస్తున్న, పారిశుద్ధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం, జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన పారిశుద్ధ్య కార్మికుల హెల్త్ అలవెన్సు రద్దు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే సమ్మె నోటీసు కమిషనర్ గారికి ఇచ్చినట్లు తెలియజేశారు. కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉపాధి అవకాశాలు గండి కొట్టే అప్కాస్ విధానం రద్దు చేయాలని, సమ్మె పోరాటంకు సిద్ధమవుతున్నట్టు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ఉద్యమముకు అందరూ ఐక్యమై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గొలగాని అప్పారావు, నక్క నాగరాజు, సోమదల గణేష్, గొల్ల రాము, నూక రాజు, చందర్రావు, బాలరాజు, రాణి, దివ్య, రామలక్ష్మి, అప్పల నరసమ్మ, వరాలమ్మ, చింతల్లి, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page