top of page

బంగారు ముని రెడ్డి ఆధ్వర్యంలో పూడికతీత పనులు ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు లో మునిసిపాలిటీ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ సెర వేగంగా జరుగుతున్నాయి, నియోజకవర్గ MLA రచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి మునిసిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమస్యలు తెలుసుకుంటున్నారు, ఇదిలా ఉండగా, ఈరోజు దొరసానిపల్లె రోడ్డు లో ఉన్న పెద్ద కాలువలో చాలా కాలంగా పేరుకుపోయి ఉన్న చెత్తను మున్సిపాలిటీ వారు కొత్తగా కొన్న జెసిబి హిటాచి తో దగ్గర ఉండి పూడిక తీత పనులను వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి ఆధ్వర్యంలో మొదలు పెట్టారు, ఎక్కడికక్కడ పేరుకుపోయిన మురికి కాలువలు శుభ్రపరిచి, అపరిశుభ్రత లేకుండా చేయాలన్నది ప్రస్తుత మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు, కార్యక్రమంలో మునిసిపల్ శాఖ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page