top of page

చావా - రేవా, పదేళ్ల వరకు బానిస బతుకా తేల్చుకోండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 4, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,

గాజువాక జోన్ - 6, పరిధి 67, 74, 87, వార్డులు గాజువాక, నడుపూరు, వడ్లపూడి, ఏరియాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలోవుంట్టే, కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్, చేస్తాంఅన్నారు. మాట నిలబెట్టు కోవాలని, 11వ పిఆర్సి ప్రకారంగా 26,000/- లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. కార్మికుల బిడ్డల భవిష్యత్తు తమ చేతుల్లో ఉంది. అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇచ్చి, కార్మికుల వారి బిడ్డలకు ఉపాధి కల్పించాలని, డెత్, ఆరోగ్యముతో సిక్కు అయినా కార్మికుల వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, కోరారు. నాగరాజు, గణేష్, రాము, గొలగాని అప్పారావు, బాలరాజు, తదితరులు గాజువాక జోన్ - 6 కు, కొత్తగా వచ్చిన AMO H గారిని మర్యాదపూర్వకంగా పూలగుత్తులు ఇచ్చి సత్కరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page