top of page

నా ఆనుమతి లేకుండా నేను లేని సమయంలో నా చాంబర్లోకి టిడిపి నాయకులు - చైర్మన్ భీమునిపల్లి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 20, 2024
  • 1 min read

నా ఆనుమతి లేకుండా నేను లేని సమయంలో నా చాంబర్లోకి టిడిపి నాయకులు - చైర్మన్ భీమునిపల్లి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఫోటోలు ఎందుకు ఇంకా తొలగించ లేదంటూ టిడిపి నేతలు ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి మాట్లాడి అనంతరం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఫోటో తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను మున్సిపల్ సిబ్బంది తో పెట్టించారు. అయితే నా ఆనుమతి లేకుండా నేను లేని సమయంలో నా చాంబర్లోకి టిడిపి నేతలు గుంపులుగా దౌర్జన్యంగా వచ్చారని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక బీసీ మహిళను అని కూడా చూడకుండా తనను ఈ విధంగా అవమానించి టిడిపి నేతలు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని చైర్పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు .ఒకవేళ ఫోటోలు తొలగించాలి అనుకుంటే సంబంధించిన జీవో తనకు చూపిస్తే తానే సహకరించేదానిని అని... ఈ విధంగా దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి ,రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటోలు తొలగించడం సరైన పద్ధతి కాదని చైర్పర్సన్ అన్నారు .ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చైర్పర్సన్ తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page