top of page

మృతిచెందిన వైసీపీ కార్యకర్త కుటుంబానికి చేయూత - 25వ వార్డు కౌన్సిలర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 12, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు, ప్రసన్న ఆంధ్ర వార్త

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక మునిసిపల్ 25వ వార్డు లో నివాసం ఉండే మహమ్మద్ రఫీ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు, గత మూడు నెలల క్రిందట గుండెపోటుతో హఠాత్మరణం చెందగా, మృతుడి భార్య మహబూబ్ బీ తన ముగ్గురు పిల్లలతో దయనీయ పరిస్థితులలో జీవనం సాగిస్తోంది. ఇది గమనించిన వైసీపీ 25వ మునిసిపల్ వార్డు కౌన్సిలర్ మాహేనూర్, ఆమె భర్త ఖాదిరి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ముప్పై వేల రూపాయల ఆర్ధిక సాయం, నిత్యావసరాలు, కొత్త బట్టలు అందించారు. ఈ రంజాన్ మాసంలో తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని, మహమ్మద్ రఫీ కుంటుంబానికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలుంటాయని, వారి పిల్లల చదువుకు ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ మాహేనూర్, ఆమె భర్త ఖాదిరి, మగ్బుల్, దాదాపీర్, ఇస్మాయిల్, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page