top of page

3వ వార్డులో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 22, 2023
  • 1 min read

3వ వార్డులో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే

పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో మధ్యవర్తుల ప్రమేయం, అధికారుల చుట్టూ ప్రదక్షణలు లేకుండా, పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మూడవ వార్డులోని మూడవ సచివాలయ పరిధి నందు ఆ వార్డు ఇన్చార్జి కృష్ణార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఖాతాలో దాదాపు 24 కోట్ల 9 లక్షల 97 వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సాయికుటీర్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.

కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, పలువురు వైసిపి నాయకులు, 3వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page