top of page

ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి మూలుగు శివైక్యం

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 23, 2022
  • 1 min read

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి, వీరశైవ పీథాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు ఈరోజు అనగా జనవరి 23, 2022 న రాత్రి 5.30 నిమిషాలకు శివైక్యం చెందారని mulugu.com నిర్వాహకులు కొడుకుల సోమేశ్వర్ రావ్ తెలిపారు.


దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, లక్షలాది మందికి మార్గదఋసనం చేయించిన ములుగు సిద్ధాంతి గారు గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకుని ఎంతోమంది సిని, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా ఉన్నారు.


శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. అందరికన్న దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు. ప్రతిసంవత్సరం ములుగు సిద్ధాంతి గారు అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సందర్భంగా చానెల్ నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page