top of page

నా ప్రాణం ఉన్నంతవరకు రాచమల్లు ను ఎమ్మెల్యే కానివ్వను - ముక్తియార్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 22, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో నేడు ఆ పార్టీ నాయకులు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు, నమ్మకం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీతో పోటీలోకి దిగాలని, అహంకారం అభద్రతా భావం వలనే రాచమల్లు ఇలాంటి వ్వ్యాఖ్యలు చేశారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి హయాంలో రాచమల్లు టీడీపీలో పని చేసిన మాట గుర్తు చేశారు. టీడీపీ ఎప్పుడయినా ఎన్నికలకు సిద్ధమని, రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలు వైసీపీ కి బుద్ధి చెబుతారన్నారు.


రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ ఆధారంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలని, అలాకాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్డు వెడల్పు పనులు చేపట్టారని వ్యాఖ్యానించారు, రాబోవు ఎన్నికల్లో తన శాయశక్తుల అడ్డుపెట్టయినా రాచమల్లును ఎమ్మల్యే కాకుండా చూస్తానని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఈ.వి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, టీడీపీ నాయకురాలు నారాయణమ్మ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page