top of page

విగ్రహ ప్రతిష్టకు ముక్కా సాయి వికాస్ రెడ్డి లక్ష విరాళం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 16, 2023
  • 1 min read

గుడి నిర్మాణానికి ముక్కా ఫౌండేషన్ ద్వారా లక్ష విరాళం.

---కమిటీ సభ్యులకు చెక్కును అందించిన సాయి వికాస్ రెడ్డి.

ఆలయ నిర్మాణానికి సాయం అందించడం మా అదృష్టమని ముక్కా సాయి వికాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం చిట్వేలు మండల పరిధిలోని వెంకటరాజు పల్లి హరిజన వాడలో నిర్మిస్తున్న గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కోసం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముక్కా సాయి వికాష్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. గ్రామస్తులు సాయి వికాస్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు, విద్యార్థులకు, ప్రమాద బాధితులకు, పేదవారికి, దేవాలయాల, మసీదుల నిర్మాణానికి సహాయం నిరంతరంగా సహాయం అందించిన గొప్పతనం, కీర్తి ప్రతిష్టలు ముఖరూపానందరెడ్డి కుటుంబ సభ్యులకు దక్కుతాయని ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో బత్తిన వేణుగోపాల్ రెడ్డి,పి. సుబ్బారెడ్డి ఎ.సుధాకర్ రెడ్డి, పి .నాగేంద్ర రెడ్డి పి.విష్ణువర్ధన్ రెడ్డి, సి.గుండాల్ రెడ్డి గ్రామస్తులు ఎడ్ల. ఈశ్వరయ్య, మహేష్, సుబ్బయ్య,జనార్ధన్, యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page