top of page

రోడ్డు ప్రమాద కుటుంబానికి ముక్కా పౌండేషన్ లక్ష రూపాయలు వితరణ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 23, 2022
  • 1 min read

రోడ్డు ప్రమాద కుటుంబానికి ముక్కా ఫౌండేషన్ చేయూత.


-లక్ష రూపాయల సాయమందిచిన ముక్కా సాయి వికాస్ రెడ్డి.

-హరికృష్ణమ రాజు వైద్యానికి సహకరిస్తున్న దాతలు.



ఈనెల 16వ తేదీన చిట్వేలు మండలం పరిధిలోని ఎం రాచపల్లి గ్రామస్తులు పాండురాజు సుబ్బరాజు మరియు రెండవ కుమారుడు కుమార్ రాజు నంద్యాల జిల్లా పాణ్యం వద్ద జరిగిన కారు ప్రమాదంలో మరణించగా మూడవ కుమారుడు హరికృష్ణ రాజు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ విధితమే.


కాగా వారి కుటుంబ సభ్యులు పరిస్థితిని స్థానిక వైసిపి నాయకులు బత్తిన వేణుగోపాల్ రెడ్డి(బాబు) ద్వారా తెలుసుకున్న ఓబులవారిపల్లె మండలం వైసీపీ నాయకులు ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్క సాయి వికాస్ రెడ్డి బాధిత కుటుంబానికి ఈరోజు ఉదయం తమ "ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్" ద్వారా లక్ష రూపాయల నగదును చెక్కు రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందించి, వారికి ధైర్యం చెప్పి వారి దాతృత్వాన్ని చాటుకోగా, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.


హరికృష్ణమ రాజు వైద్యానికి పెద్ద ఎత్తున స్పందించిన దాతలు: కాగా హరికృష్ణంరాజు వైద్యం నిమిత్తం వివిధ పత్రికల్లోనూ, సామాజిక మాధ్యమాలలో ప్రచురించిన వార్తలకు స్థానికులు,సుదూర ప్రాంతాల వారు,దయార్థ హృదయం గల దాతలు, స్వచ్ఛంద, CHS లాంటి సంస్థలు "మానవసేవే మాధవసేవ" అన్న తలంపుతో వైద్య ఖర్చులకగు మొత్తాన్ని సుమారుగా సాయం అందించడంతో బాధిత కుటుంబ సభ్యులు దాతల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.



ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, ఎంపీపీ చంద్ర, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి,ఉమా మహేశ్వర్ రెడ్డి, గిరిబాబు రాజు, రోషన్ జమీర్,సర్పంచ్ బాలు, చిట్వేలు హెల్ప్ లైన్ సొసైటీ బాధితులు గాడి ఇంతియాజ్, సదరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page