top of page

ఎంపిడిఓ కార్యాలయంలో కుల గణన అవగాహన కార్యక్రమం

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 22, 2023
  • 1 min read

ఎంపిడిఓ కార్యాలయంలో కుల గణన అవగాహన కార్యక్రమం

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

నందలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో సౌభాగ్యం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కుల గణన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి ఎల్ డి ఓ నరసింహ మరియు మండల పరిషత్ అధ్యక్షుడు మేడా విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు.

కార్యక్రమానికి హాజరైన సచివాలయ సిబ్బంది

ఈ సందర్భంగా ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఓటర్ల జాబితాలో ఉన్న మొత్తం కులాల వారీగా ఘనంగా చేసే కార్యక్రమాన్ని గ్రామ సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లను కలుపుకొని పోయి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డి ఎల్ డి వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని దీనిని గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ టైం లోపల పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మోహన్ కృష్ణ, ఈ ఓ పి ఆర్ డి. సతీష్, సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page