top of page

అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అవినాష్ రెడ్డి భూమి పూజ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 20, 2023
  • 1 min read

అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అవినాష్ రెడ్డి భూమి పూజ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఆటోనగర్ మలుపు వద్ద కల్వర్టుకు అలాగే నాలుగు అడుగుల వెడల్పు తో రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద నుండి 350 మీటర్ల మురుగునీటి కాల్వకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం సాయంత్రం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొనగా అనంతరం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కల్లూరు నాగేంద్ర, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, శివచంద్ర రెడ్డి తనకు ఆప్తుడని గత 30 సంవత్సరాలుగా తాము రాజకీయాలలో అన్నదమ్ములుగా మెలిగామని అన్నదమ్ముల నడుమ పొరపొచ్చులు సహజమని, అలాంటి సందర్భాలను టిడిపి పావుగా వాడుకొని తమ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, వైసీపీ పార్టీలో తామందరం సోదరులమని సమస్య తమ వద్దకు వస్తే ఏనాటికైనా ఒకటైతామని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు ఆరోపణలు చేయటం మానుకోవాలని హితువు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page