top of page

మా ప్లాట్లను మేమే ఖబ్జా చేశాము అని ఆరోపిస్తున్నారు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 13, 2022
  • 1 min read

మా ప్లాట్లను మేమే ఖబ్జా చేశాము అని ఆరోపిస్తున్నారు


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


తమ ప్లాట్లను తామే కబ్జా చేశామని ఆరోపించడం దారుణం అని మూలవారిపల్లే ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర ఒరిజినల్ రికార్డులు ఉన్నాయని, అందుకే మాకు న్యాయం జరిగింది అంటూ, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చొరవ తీసుకొని వారికి న్యాయం చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు.

ఆక్రమణదారులు వారి దగ్గర భూమికి సంబంధించిన పట్టాలు ఉంటే తాము స్థలం వడిలేస్తామని, 35 సంవత్సరాలు పైగా తమ దగ్గర డాక్యుమెంట్లు ఇసిలు ఉన్నాయని 2013 సంవత్సరంలో వారి ప్లాట్లలోకి వారు వెళుతుంటే ఆక్రమణదారులు అడ్డగించారని, నాడు రూరల్ పోలీసులు కూడా ఆక్రమణదారులులను హెచ్చరించారని, అయినా భేఖాతారు చేసిన పిదప స్పందన కార్యక్రమంలో ధరకాస్తు చేయగా తమకే అనుకూలంగా తీర్పునిచ్చారని తెలిపారు.


1925లో ఫ్లాట్లు మాకు రిజిస్టర్ అయివుండగా, నేడు ఆక్రమణదారులు తమని ఖబ్జా దారులుగా చితీకరించటం తగదని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా మాకు న్యాయం జరగాలని అధికారులను అడుగుతున్నా పట్టించుకోలేదని. ఎమ్మెల్యే అధికారులను ఫ్లాట్లు ఎవరి పేరున ఉన్నాయి అని అధికారులను అడుగగా మా పేరున ఉన్నందున మాకు తగు న్యాయం చేశారు అని అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page