MLC ఆదేశంతో కదిలిన మునిసిపల్ అధికారులు
- VOICE OF HERALD

- Jan 20, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు 11వ వార్డు పోతుల వీరారెడ్డి వీధిలోని కల్వర్టు మరమ్మత్తు పనులు త్వరలో చేపట్టనున్న ప్రొద్దుటూరు మునిసిపల్ అధికారులు, ఈ వీధిలో దాదాపు చాలా కాలం నుండి కల్వర్టు దెబ్బతిని అటుగా వెళ్తున్న వాహన చోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు, ఇక్కడి స్థానికులు వైసీపీ MLC రమేష్ యాదవ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లగా స్పంచించిన MLC మునిసిపల్ అధికారులతో మాట్లాడి కల్వర్ట్ మరమ్మతులు చేయమని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మునిసిపల్ శాఖ అధికారులు తక్షణమే కల్వర్ట్ మరమ్మత్తు పనులు చేపడతామని తెలిపారు, కాగా పట్టణం లోని వివిధ ప్రాంతాలలో అక్కడక్కడా కల్వర్టులు దెబ్బతిని ఉన్నాయని వాటిని కూడా మరమ్మత్తు చెయ్యవలసిందిగా పట్టాణ ప్రజలు కోరుతున్నారు.




Comments